గాన గంధర్వుడు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 గాన గంధర్వుడిగా...
కళామతల్లి ముద్దు బిడ్డగా...
సుస్వరాల సృష్టికర్తగా...
కోట్లాది ప్రజల అభిమాన గాయకుడిగా...
నవయువ గళాలకు ప్రేరణగా...
గురుపూజ్యుడిగా...
మార్గదర్శకుడిగా...
నటుడిగా...
స్వరదాతగా...
సహోదరుడిగా...
ఎందరెందరో మహనీయుల
మన్నలనను పొంది...
బహుముఖ ప్రజ్ఞాశాలిగా
కీర్తిని గడించి...
40,000 పాటలను అలవోకగా ఆలపించి...
16 బాషలలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి..
అవార్డుల,రివార్డుల 
బాటలో అఖండ శిఖరాలను  అధిరోహించి...
తెలుగు పదాల తియ్యదనాన్ని తనివితీరా
ఆస్వాదించి...
స్వరసీమలో నవ ప్రయోగాలకు నాంది పలికి...
మంచి సాహిత్యాన్ని 
మరింత సొగసుగా తన గాత్రాన
పలికించి...
శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేసి...
మధురమైన భావాల
కెరటాలకు
రాగాల రంగులను అద్ది...
గొంతుకను గుండెలకు చేరువ చేసి...
రారాజుగా రాగాల పల్లకిలో ఊరేగి...
స్వర సీమలో సరిగమల ఘుమఘుమలను వడ్డించి...
పదిలమైన పాటగా ప్రజల మనసుల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నావు...
స్వయంకృషితో, క్రమశిక్షణతో, నిబద్ధతతో ఎదిగి ఒదిగి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచావ్
ధన్యజీవుడవు- బాలూ-భవ్యజీవుడవు


కామెంట్‌లు