తొట్టంబేడు:
మండలంలో పెన్నలపాడు ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు కవి, రచయిత, మిమిక్రీ కళాకారుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం కు జ్యోతిరావు పూలే పురస్కారం కు ఎంపిక అయ్యారని పూలే టీచర్స్ ఫెడరేషన్ నిర్వాహకులు సమాచారం అందించారని బాలు తెలిపారు.విద్య,సాహిత్యం,కళ,సామాజిక సేవ తదితర రంగాల్లోఆయన చేస్తున్న కృషికి గాను ఈ నెల పదహారవ తేది తిరుపతి లో దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రాంగణం నందు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్టు పూలే టీచర్స్ ఫెడరేషన్ వారు తెలియచేసారు.ఈ అవార్డు రావడం పట్ల పలువురు బాలుని అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి