న్యాయాలు -93
దండ చక్ర న్యాయము
******
దండము అంటే కఱ్ఱ,గద,ముదరము,రాజ చిహ్నము, సన్యాసి ధరించు కఱ్ఱ అనే అర్థాలు,చక్రం అంటే బండి చక్రము, కుమ్మరి చక్రము, విష్ణువు ఆయుధ విశేషము, సమూహము అనే అర్థాలు ఉన్నాయి.
దండము, కుమ్మరి చక్రముతో పాటు మట్టి, జలము అన్నీ ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించి కుండలు చేయగల కుమ్మరి వ్యక్తి , అతనికి అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పూ లేక పోతే కుండలు తయారు కావు అనే అర్థంతో ఈ దండ చక్ర న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అక్కడ కుండ చేయడానికి మట్టి వుంది, మట్టిని కలపడానికి నీళ్ళు ఉన్నాయి.కుండ చేసే పరికరము ఉంది. తిప్పడానికి కర్ర ఉంది. అన్నీ సమకూర్చబడ్డాయి.కానీ చేయగల వ్యక్తి అక్కడ లేడు. ఒక వేళ ఉన్నా చేయగల సామర్థ్యం, ఆసక్తి, కావలసిన నేర్పు కూడా అవసరం కదా!.
అలా చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వెనుకాడని వ్యక్తులకు ఏదైనా సాధ్యమే.ప్రపంచంలో తిరుగులేని విజయాలను చవి చూసిన వారంతా ఈ కోవకు చెందిన వారే.
ఉన్న పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకోగలిగి లేదా తామే ఆ పరిస్థితులకు అనుగుణంగా మారి అనుకున్నది సాధించ గలగడమే దండ చక్ర న్యాయము.
నేటి కుటుంబ, సామాజిక వ్యవస్థకు ఈ న్యాయాన్ని ఎలా వర్తింప జేయవచ్చో చూద్దాం.
నేడు తల్లిదండ్రులు ఒకరిద్దరి కంటే ఎక్కువ కనడం లేదు.వారి ఉన్నతమైన అభివృద్ధి కోసం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు కానీ పిల్లలు వాటిని సరిగా అందిపుచ్చుకోవడం లేదు.తమకు ఉన్న తెలివి తేటలను, సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తద్వారా తల్లిదండ్రుల కష్టార్జితం, సమకూర్చిన అవకాశాలు వృధా అవుతున్నాయి .
అంతే కాదు తరచి చూస్తే చుట్టూ ఉన్న సమాజంలో అనేకమైన అవకాశాలు,తమ ప్రతిభను వెల్లడించుకుని తద్వారా జీవనోపాధి పొందగలిగే వనరులు చాలా ఉన్నాయి.వాటిని అందిపుచ్చుకునే ఓర్పు, నేర్పు , నైపుణ్యం, మానసిక సంసిద్ధత ఉండాలి. అప్పుడే ఈ దండ చక్ర న్యాయానికి సరైన న్యాయము జరుగుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి