కవితోదయం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వేకువ
అయ్యింది
మెలుకువ
వచ్చింది

మదిలో
అలారముమ్రోగింది
మేనును
గట్టిగాతట్టిలేపింది

సూర్యోదయం
కావస్తుంది
కవితోదయం
సమయమయ్యింది

కాలము
గడుస్తుంది
మనసు
పరుగెత్తింది

ఆలోచన
తలలోతట్టింది
భావన
తయారయ్యింది

కలము
గీస్తుంది
కవిత
పుడుతుంది

అక్షరాలు
అందుచున్నాయి
పదాలు
పొసుగుతున్నాయి

ప్రాసలు
కుదురుతున్నాయి
లయలు
అమరుతున్నాయి

కష్టము
ఫలిస్తుంది
కవిత
జనిస్తుంది

కవికి
కష్టమెందుకో?
కవితకు
తొందరెందుకో?

విషయము
తెలుసుకోవాలి
విరుగుడు
కనుక్కోవాలి

నిత్యకవితకు
స్వాగతం
దైనికపాఠకులకు
సుస్వాగతం

సుపుత్రునిపై
సరస్వతీమాత
వాత్సల్యానికి
వేలవందనాలు


కామెంట్‌లు