నేర్వాలి! అచ్యుతుని రాజ్యశ్రీ

 కొన్ని బడులలో పుస్తకాలు ఇచ్చి  క్లాసులు కూడా నడుపుతున్నారు. తాత  చక్కగా పిల్లల పుస్తకాలకి అట్టలువేసి పేర్లు రాశాడు.ముందుగా పుస్తకాల బొమ్మలు చూడమని ఆపై ఇలాచెప్పాడు" హమ్మో!ఈపుస్తకాలు ఎలాచదవాలి దేవుడా అని  ఖంగారు పడకండి. డిక్షనరీ పెట్టుకొని అర్థాలు వెతికి చదివి అర్ధం చేసుకోండి.మన కృషి శ్రమ ఆసక్తి పై అంతా ఆధారపడి ఉంటుంది. కొందరు గొప్పగా ఎదిగితే ఇంకొకరు బద్ధకంతో చతికిలపడిపోతారు.ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉండిపోతారు.మనం చేయాల్సిన పనులు కాగితం పై రాసి అలా చేస్తూ పోవాలి అప్పుడే పుట్టిన  ఆవుదూడ ఓగంటలోపే లేచి నడిచే ప్రయత్నాలు చేస్తుంది. తల్లి పొదుగు దగ్గర మూతిపెట్టి పాలు తాగుతుంది.మీకు ఇష్టమైన సబ్జక్ట్ తీసి చదవండి"
తాత మాటలతో పిల్లలు ఖుషీ ఐనారు.తమకు నచ్చిన సబ్జక్ట్ తీసుకుని చదవటం మొదలు పెట్టారు.ఇలా వేసవి సెలవలు సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు 🌹
కామెంట్‌లు