సుప్రభాత కవిత ; - బృంద
సింధూర వర్ణాల మెరిసే తూరుపు
కాంతి వలయంలో జ్యోతి మెరుపు

ఉషోదయాన హృదయం పాడే
ఉదయరాగ  సంచారం

కొండల నడుమ ప్రభవించే
జగతిని మేలుకొలిపే పావనతేజం

అనంత జీవన వాహినిలో
 ఆనందం పంచే మరో అవకాశం

మాపున మోసిన కలతలు
మాపే రేపటి కొత్త వెలుగులు

అడుగులు సాగే గమనం
అలుపేలేని  పయనం

కడలిలో కెరటాల తీరు
మదిలో ఊహల జోరు

ఏదొచ్చినా కలకాలం నిలవదనే
చక్రభ్రమణ నిగూడసత్యం

అర్థం అయిన మనసుకు
అంతా ఆనందమయం

వేకువను వెలిగే తూరుపు
వెలుతురును మింగే పశ్చిమం

ప్రతిరోజూ జననం 
ప్రతిరాత్రీ మరణం
ఇదే జీవన సమీకరణం

శుభాలు తెచ్చే ఉషోదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు