వేయి వరహల మూట.;- డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 భువనగిరిని పాలించే గుణశేఖరుడు తనమంత్రి సుబుధ్ధితోకలసి మారువేషాలలో ఆఊరి సంతలో పాల్గోన్నాడు. ఆచుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా  సంతలోతమకు కావలసిన వస్తువులు కేనుగోలుచేస్తున్నారు.
అప్పటివరకు ఆసంతలో యాచన చేస్తున్న వృధ్ధుడు,అక్కడ తమ వలలోచిక్కిన పలురకాల పక్షులను పంజరాలలోపెట్టి అమ్ముతున్న వారివద్దకు వెళ్ళి వారితో మాట్లాడి వారుఅడిగిన ధరచెల్లించిన అనంతరం వారివద్ద బందీగాఉన్న పక్షులను పంజరాలనుండి విడుదల చేయసాగాడు.
అప్పటివరకు అతనిచర్యలను గమనిస్తూ అతనికి చేరువగా ఉన్న రాజు గుణశేఖరుడు ఆశ్చర్యపోయాడు. యాచనచేసే వృధ్ధుడు మరికొంత ముందుకు వెళ్ళి బంధించబడిన కుందేళ్ళు అమ్ముతున్న వారితో మాట్లాడాడు.ఆయాచక వృధ్ధుడు మరికొందరినియాచిస్తూ మారువేషం లోని రాజుగారి వద్దకువచ్చి 'అయ్యా ఒకరూక దానంచేయండి' అనిచేయి చాపాడు. తనరొంటిలో నుండి ఒకవరహ తీసి ఇచ్చాడు మంత్రి.
'ధర్మప్రభువులు చల్లగాఉండాలి'అని దీవించి వెళ్ళిన వృధ్ధుడు,కుందేళ్ళు అమ్మేవారు అడిగినంత ధర చెల్లించి వారిని తనవెంటపెట్టుకువళ్ళి చేరువలోని అడవిలో వాటిని వదిలివేయమన్నాడు. ఇదంతాగమనించిన గుణశేఖరుడు "మంత్రివర్యా యాచకునిలో ఇంతటి దయార్ధతహ్రుదయం ఉండటం చాలా గొప్పవిషయంకదా "అన్నాడు "ప్రభు మనశరీరంపై ధరించేనగలు కృత్రిమమైనవి. కాని మనిషికి పుట్టుకతోనే బంగారం,వజ్ర వైఢూర్యాలకన్నా విలువైన ప్రేమ,జాలి,దయ,కరణ,పరోపకారంవంటి అత్యంత విలువైనసులక్షణాలతో జన్మిస్తాడు. పుట్టుకతో తమకు లభించిన ఆవెలలేని ఆభరణిల విలువ తెలుసుకున్నవారు జీవితంలో ఉన్నతులుగా సాటివారికి సహయపడుతూ జీవించి,చరిత్రలోమహోన్నతులుగా  మిగిలిపోతారు. ఆవృధ్ధుడు కనుమరుగు కాకముందే అతన్ని కలుద్దాం" అంటూ వడివడిగా అడుగులువేస్తూ ,అతనివద్దకు చేరినమంత్రి "తాతా యాచనలో వచ్చినదంతా పక్షులకు,కుందేళ్ళవిడుదలకు ఇచ్చివేసావే, రేపటి నీ ఆకలి ఎలాతీర్చుకుంటావు" అన్నాడు మంత్రి సుబుధ్ధి. "నాయనా దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ.. ‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు.
శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు. దానంచేసే అంతటి ధనవంతుడను నేనుకాను కనుక నావద్ద యాచనతోవచ్చిన ధనతో వారం వారం ఈసంతలో ఆమూగజీవాలకు విముక్తి కలిగిస్తున్నాను.ప్రతిదినం యాచనతో జీవించేనాకు ఏదైనా దేవాలయంలో అంతప్రసాదమో! లేదంటే ఏదయామయురాలైన తల్లి పట్టెడు అన్నంపెడుతుంది.నాకు రేపటి చింతనలేదు. మనంచేసే మంచి పనిలో కలిగే ఆనందం ముందు మరేదిసాటిరాదు. ప్రతి పండుకు ఓరుచి ఉన్నట్లే ప్రతి మంచి కార్యానికి ఓగోప్ప అనుభూతిఉంటుంది ఆనందం అనుభవించితీరాలేకాని మాటలతో వర్ణించలేము" అన్నాడు ఆవృధ్ధ యాచకుడు."నిజమే తాత నీవుచెప్పినమాట వేయివరహల మూట "
తనవద్దఉన్న వేయి వరహలమూట వృధ్ధుని చేతికి అందించిన మహరాజు, తనమంత్రితోకలసి రాజధానికి బయలు దేరాడు.
.

కామెంట్‌లు