తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 కడుపులో పెట్టుకొను.
ఆదరించు... పోషించు...
తామ్ర చూడము (కోడి) గాని, పక్షులు, కొన్ని జాతి జంతువులు పిల్లలను తమ కడుపులోనికి దోచుకొని రెక్కలను కప్పుకొని కడుపులో పెట్టుకుంటాయి. ఏదేని ఒక ప్రమాద ఘంటీక మ్రోగిందంటే వెంటనే పిల్లలు తల్లుల కడుపులోనికి దూరిపోతాయి. అంటే ఎలాంటి కష్టాన్ని కూడా పిల్లలకు కలగకుండా సాదడమన్నమాట.
ఇదే విధంగా సమాజంలో తల్లి తండ్రిని పోగొట్టుకున్న పిల్లలను ఆదరించి దగ్గరకు తీసుకొని కడుపులో పెట్టుకొని ధర్మాత్ములు ఉన్నారు. ఇది ప్రభుత్వ కొన్ని ఆశ్రమాలను ఏర్పాటు చేసి orphan hostels నెలకొల్పింది. కానీ కడుపులో పెట్టుకొనుట అని దీనికి అర్థం కాదు.

కామెంట్‌లు