నేటి బాలలే రేపటి పౌరులు;- బల్ల కృష్ణవేణి పలాస
 కళింగ రాజ్యంలో చంద్రాంగదుడు అనే రాజు పాలించుండెను. ఆ రాజు కుమారుడు యువరాజు అయిన వీరసేనుడు. అతడు విద్యార్థి దశలో ఉన్నాడు. అనేక బల, అతి బల విధ్యలు నేర్చుకున్నాడు. అతడు రోజు అడవికి జంతువులను వేటాడ్డానికి వెళ్తుండేవాడు. ఒక రోజు అడవిలో కొలను దగ్గర నీళ్లు తాగే శబ్దం విని జంతువు అనుకుని బాణం వేశాడు. తరువాత అక్కడికి వెళ్లి చూసేసరికి అతనికి కళ్ళు అబ్బురపడ్డాయి. అక్కడ చూడగా ఒక ముని కుమారునికి బాణం తగిలింది. ఆ బాలుడు పడిపోయి ఉన్నాడు. వెంటనే వీరశేనుడు ఏమి చేయాలో తోచక రారాజు అయిన తన తండ్రి చంద్రాంగుడు దగ్గరకు వెళ్లి చెప్పాడు. అప్పుడు రాజు, రాణి,యువరాజు బటులతో కలిసి అడవిలో కొలను దగ్గరకు వెళ్లి చూశారు. అక్కడ బాలుడు లేడు. బటులు చుట్టూ ప్రక్కల వెతికారు. దగ్గర్లో ఒక గురుకుల పాఠశాల ఉంది అని రాజుకు చెప్పారు. అప్పుడు రాజుగారు అంతా కలిసి ఆ గురుకులానికి వెళ్లారు. అక్కడ గురువుగారికి రాజు ఇక్కడ కొలను దగ్గర బాలుడికి బాణం తగిలి పడిపోయాడు. ఆ బాణం మా యువరాజు వేశాడు. ఇప్పుడు చూస్తే ఆ బాలుడు అక్కడ లేడు అని నిజాయితీగా, ధర్మబద్ధంగా రారాజు అడిగారు. గురువుగారు రాజు గారి ఔన్నత్యానికి మెచ్చుకొని నమస్కరించి ఇలా చెప్పారు. ఆ బాలుడు మా గురుకులం విద్యార్థి. ఇదిగో వీడే బ్రతికే ఉన్నాడు చూడండి అని అన్నాడు. అప్పుడు యువరాజు ఈ బాలుడే అని రాజు కి చూపిస్తూ అన్నాడు. రాజుగారు ఆశ్చర్యంగా చూశారు. మా విద్యార్థులు క్రమశిక్షణ వాళ్ళకి శ్రీరామరక్ష అని గురువుగారు అన్నారు. గురువుగారు చెప్పిన క్రమశిక్షణ పాఠాలు రారాజు అచ్చు వేయించి నేటి తరానికి అందించారు అది ఏమిటంటే!!
   ఓ! విద్యార్థులారా! మీకు చిన్న వయసులో తల్లి , తండ్రి , గురువు హితం చెబుతారు. వయసుకు వచ్చిన తరువాత మంచి వ్యక్తుల మధ్య ఉండాలి.ఆ నాడు రాముడు లాంటి మంచి మనుషులు దగ్గర రావణాసురుడు వంటి చెడ్డ వ్యక్తులు ఉన్నారు.ఇప్పుడు కూడా అంతే. ఆ నాడు సీత, సావిత్రి, మండోదరి, అహల్య వంటి పతివ్రతలు ఉన్నా, కైకేయి మందర సూర్పనఖ లాంటి చెడ్డవారు ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే విద్యార్థుల్లారా !!!...మీరు మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి. అనేక మంది యోధులు పుస్తకాలు చదవండి. క్రమశిక్షణ పాటించాలి.
1. ఉదయాన్నే ఐదు గంటలలోపు లేచి వ్యాయామం చేయాలి.
2. మనసుని నియబద్ధంగా ఉండడానికి యోగ చేయండి.
3. మంచి ఆలోచన శక్తి పెరగడానికి మంచి పుస్తకాలు చదవండి.
4. బద్ధకం వినండి. రేపు చూద్దాం చదువుదాం అన్నది , ఈ రోజే చేయాలి,చదవాలి అన్నట్లు ఉండాలి.
5. పెద్దల నుండి మంచి మాటలు నేర్చుకోవాలి.
6.సత్యం పలకాలి.అబద్ధాలు ఆడకూడదు. ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడవలసి ఉంటుంది.
7. బ్రహ్మచర్యం, విద్యార్థి దశలో చదువుకే ప్రాధాన్యత ఇవ్వాలి. టెక్నాలజీ, సోషల్ మీడియాకు అలవాటు పడకూడదు.
 ఈ ఏడు క్రమశిక్షణ సూత్రాలు పాటిస్తే మీ భవిష్యత్తు బంగారు బాటవుతుంది. ఈ సూత్రాలు పాటించడం వలన గురుకులం విద్యార్థులకు బాణం తగిలిన ప్రాణం పోలేదు.
నేటి తరం విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలి. నేను చదవలేను నావల్ల కాదు, నాకు ర్యాంకులు రావు అని బద్ధకం పడి, టీవీలకు మరియు సెల్ కి అంకితం అవుతున్నారు. టెన్షన్ కి గురవుతున్నారు. ఆత్మహత్యల పాలవుతున్నారు. ఓ భారత్ మాత ముద్దుబిడ్డల్లారా !!!ఈ నాటి ప్రభుత్వం మీ బంగారు భవిష్యత్ కోసం ఎన్నో, ఎన్నెన్నో పదకాలు ఇస్తుంది. దానిని అందుకని మీ చదువుని సద్వినియోగం చేసుకొని గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం స్థాపించండి. నేటి విద్యార్థులే రేపటి గాంధీజీలుగా మారండి. భారతదేశం మన మాతృభూమి భారతదేశాన్ని మహోన్నత దేశముగా తీర్చిదిద్దండి. "నేటి విద్యార్థులే రేపటి భారతదేశం", అని గురువుగారు బోధించారు.
                  🇳🇪 జైహింద్🇳🇪

కామెంట్‌లు