గాంధీ మార్గం!అచ్యుతుని రాజ్యశ్రీ

 బడి ఆఖరి రోజున పిల్లలంతా పార్టీ ఏర్పాటు చేశారు టీచర్లకి.అందరికీ పూవు పండు తాంబూలం ఇచ్చారు. ఆఖరుగా చైర్మన్ ఇలా అన్నారు"పిల్లలూ!మీప్రేమ ఆప్యాయత మరువలేనివి.పండుతాంబూలం బదులు తలా ఒక మొక్క ఇస్తే చాలా బాగుండేది.ఇవి తినేస్తాం.మొక్క కళ్ల ఎదుట పెరుగుతుంది.ఒకసారి గాంధీజీకి పూలమాలలు వేశారు. ఆయన ఏమన్నారో తెల్సా? పూలు వాడిపోతాయి. వీటిబదులు వడికిన నూలు దండలు వేస్తే  అవి వస్త్రాలు నేయటానికి ఉపయోగపడుతాయి అని. " పిల్లలంతా  నిజమే అని  చప్పట్లు కొట్టారు 🌹
కామెంట్‌లు