ఓ నేస్తమా నా నేస్తమా
పుస్తకమా నా మస్తక పరిమళమా
అమ్మ వలె లాలించేవు
నాన్నల పాలించేవు
గురువుల బోధించేవు
నను మనిషిలా నిలబెట్టేవు
అక్షరాల అల్లికవూ
మిత్రునిలా దరిచేరేవు
ఊహాశక్తిని పెంచేవు
ఉన్నత స్థానం నాకందించేవు
ఏకాగ్రతను పెంచేవు
మనో నిబ్బరం పంచేవు
సృజనను నాకు ఇచ్చేవు
సద్గుణాలనే అలవరచేవు
అలసిన వేళన ఆలంబనవు
ఒంటరివేళన ఓదార్పువు
జ్ఞానమనే నీటి ఊటవు
విజ్ఞానిగానను నిలిపేవు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి