తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 ఋణము తీరు:-
సంబంధం లేకుండా రుణం అంటే అప్పు. తీరు అంటే అయిపోవు.ఋణము అంటే అప్పు అన్నాము కదా! ఒకరి దగ్గర అక్కెర నిమిత్తము తీసుకున్న సొమ్ము. ఆ సొమ్ము సమయానికి ఇచ్చివేయడం తీర్చడం అంటారు. అయ్యా! నీ ఋణము తీరిపోయింది. నీ అప్పు తీరిపోయింది అనుట పరిపాటి.
కానీ ఋణము తీరు అంటే సంబంధము తెగిపోయిందని, లేకుండా పోయిందని వాడుతుంటారు. తల్లో తండ్రు లో పరలోక గతులైతే"బాబూ! ఋణము తీరిపోయింది"బాధపడకు అంటారు. నిజానికి ఋణము అంటే సంబంధం బంధం స్ఫురింప చేసే పదం. అది తీర్చబడితే బంధం లేనట్లే.
రైతులు, శ్రామికులు షావుకారుల వద్ద, సేటు గారి వద్ద అప్పు తీసుకొని వారి బంధం ఏర్పరచుకుంటారు. అప్పు తీర్చనంత కాలం వారి ఇంటికి వచ్చి గాని ఎదురైనప్పుడు గానీ మాట్లాడుతారు. ఎందుకంటే బంధం ఉంది కాబట్టి. అది తీర్చమనుకో ఇక మన పంచకే రాడు. మన ను చూస్తే ఆ మాటనే ఎత్తడు.

కామెంట్‌లు