పేదరికం ఎన్నెన్నో అవమానాలు కష్టాలు అభాండాలు సమాజంవేసిన నిందలు భరించి గొప్ప సాహితీవేత్తగా ఎప్పుడూ గుర్తుండిపోతారు ఆయన! చిన్న వయసులో అమ్మా నాన్న లు చనిపోటం మేనమామ పెంపకం లో పెరిగాడు ఆపిల్లాడు.20రూపాయల పరీక్ష ఫీజు కట్టలేక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆటపాటలు ఫ్లూట్ వాయించడం బొమ్మలు గీయడం బాల్యంనించి అబ్బిన కళలు!తండ్రి చిన్న కథలు నవలలు నాటికలు రాయడం ఆచిన్నారికి వారసత్వంగా అబ్బింది. 17వ ఏట మందిర అనే కథను సురేంద్రనాధ్ గంగూలీ అనే పేరుతో పంపి పోటీలో ప్రధమబహుమతి పొందాడు. నిలకడ స్థిరత్వంలేని గాలిపటంగామారాడు.
రంగూన్ ( బర్మా మయన్మార్) వెళ్లి రచయిత గా తన పేరు లేకుండా ఓనవల రాశారు.అంతా రవీంద్రనాథ్ టాగోర్ రాశారని భ్రమపడ్డారు."నేను కాదు" అని విశ్వకవి అనటంతో జనాలు ఆలోచనలో పడ్డారు.
చేతిలో రెండే రెండు రూపాయలు చింపిరి జుట్టు చిరిగిన దుస్తులతో రంగూన్ లో బాబాయ్ దగ్గర ఉన్నాడు. చిన్న చితక ఉద్యోగాలు చేస్తూ టాల్స్టాయ్ రాసిన అన్నాకెరెనినాని 50సార్లకుపైగా మధించాడు. సరిగ్గా అప్పుడే ప్లేగువ్యాధి ప్రబలటంతో రోగుల సేవచేశాడు.కులబహిష్కరణకు గురైన ఆయన శీలంలేనివాడు అనే అపనిందలు భరించాడు.రాత్రి బుడ్డీదీపం వెలుగులో నవలరాశారు. జావా సుమత్రా బోర్నియో ద్వీపాలకు పొట్టకూటికై పయనించాడు.
శాంతి అనే బాలిక ఈయువకుని దగ్గరకు వచ్చి భోరున ఏడ్చింది"మానాన్న ఓముసలి తాగుబోతు జూదరికి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నాడు " అని. ఆమెను పెళ్లాడి నానామాటలు అనుభవించాడు.తక్కువ కులం పిల్లతో ఉన్నాడని పుకార్లు పుట్టించి నానాయాగీ చేశారు. ఓపిల్లాడిని కని భార్య చనిపోతే తోపుడు బండిలో స్మశానంలో ఓసన్యాసిసాయంతో అంత్యక్రియలు చేశాడు. ఆమె తో పాటు శిశువు కూడా ప్లేగుకి బలైనాడు.అలాంటి పరిస్థితి లో కృష్ణదాస్ అనే వ్యక్తి తనకూతురు మోక్షద పెళ్లిచేయలేక ఇంటినుంచి పారిపోతే ఆమెని ఎలాంటి పెళ్లి తతంగం లేకుండా భార్య గా స్వీకరించాడు.హిరణ్మయి గా ఆమె పేరు మార్చాడు. 1916లో బర్మానించి కలకత్తా చేరి టాగోర్ శిష్యుడిగా మారారు.చిత్తరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్ తో కల్సి దేశం కోసం పనిచేశారు. ఆయన రచనలు ఆంగ్ల ఫ్రెంచ్ ఇటాలియన్ దాదాపు అన్ని భారతీయ భాషలలో అనువదింపబడినాయి.సినిమాలు గా చరిత్ర సృష్టించాయి.
ఆమహాసాహితీవేత్త కి జోహార్లు! అందరికీ చిరపరిచితులైన ఆసాహితీవేత్త ఎవరో!?
ఆయన తల్లిదండ్రులు భువనమోహిని మోతీలాల్.
ఆయన నవలలు దేవదాసు చరిత్రహీన బడదీదీ బిందువాసనీయ మాగ(ముద్దుబిడ్డ) బాటసారి దేవదాసు హిట్ సినిమాలు .ఆయనే శరత్ చంద్ర చటోపాధ్యాయ!శరత్ గా ప్రసిద్దుడు🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి