సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -100
దర్వీపాకరస న్యాయము
******
దర్వీ అనగా గరిటె. కొయ్యతో చేసిన దానిని తెడ్డు అంటారు. పాకము అంటే వంట.రసము అంటే సారము. గరిటె వంట పదార్థముల అన్నింటిలో మెలగుచున్నప్పటికీ ఆ వంట పదార్థాల రుచిని గ్రహించలేదు.
మూర్ఖుడయిన వాడు  మంచి వారితో కలిసి తిరిగినా వారి గుణగణాలను,జ్ఞాన సారాన్ని ఎప్పటికీ తెలుసుకో లేడు.గ్రహించలేడు అనే అర్థంతో ఈ దర్వీ పాక రస న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి సంబంధించిన భాస్కర శతక పద్యాన్ని చూద్దాం.
"ఎడ్డెమనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడి యుండినన్/దొడ్డ గుణాడ్యునందుగల తోరపు వర్తనలెల్ల ప్రజ్ఞ బే/ర్పడ్డ వివేక రీతి; రుచి పాకము నాలుక గాకెఱుంగునే?/ తెడ్డది కూరలో గలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా."
చక్కగా వండిన కూర యొక్క రుచి నాలుక తెలుసుకుంటుంది కానీ, ఎప్పుడు ఉడుకుతున్నప్పుడూ,ఉడికిన తర్వాత కూరలోనే ఉండే తెడ్డు లేదా గరిటెకు ఆ కూర రుచి ఎలా వుంటుందో తెలియదు.అలాగే గుణవంతుడి యొక్క ఉత్తమ గుణాలను  జ్ఞానవంతుడే తెలుసుకోగలడు. కానీ అతడితో ఎన్ని రోజులు కలిసి వున్నా , తిరిగినా మూర్ఖుడు ఏమాత్రం తెలుసుకోలేడు.అంటే మంచి ,చెడుల విచక్షణ తెలియాలంటే వ్యక్తుల్లో అలాంటి  తెలుసుకునే  జ్ఞానం ఉండాలి.
అలాంటి జ్ఞానం లేని మూర్ఖుడికి ఎదుట ఉన్న వ్యక్తి సుగుణ వంతుడైనా కానీ తన చుట్టూ  సమాజంలో ఉన్న మంచి వారిని గానీ  గుర్తించ లేడు అనడానికి ఈ" దర్వీ పాక రస న్యాయము" సరిగ్గా సరిపోతుంది.
అందుకే ఓ కవి "తెడ్డునకు వచ్చునే పాకగుణాగుణావళుల్"  అంటే...
"అడ్డ విడ్డెము తిరిగే తెడ్డెరుగునె పాలతీపి"అంటాడు వేమన .అంతటితో ఆగకుండా "కుక్క యేమెరుంగు గురులింగ జంగంబు/పిక్కబట్టి యొడసి పీకుగాక/ సంతపాకతొత్తు సన్నాసి నెరుగునా "...
 "అంటే "వ్యక్తి యోగినో,జంగమ దేవరో  కుక్కకు ఎలా తెలుస్తుంది. మీదకు ఎగబడి కరవడం తప్ప " యని చమత్కరిస్తాడు.
దీనినే తెలుగులో"తెడ్డుకేమి తెలుసు కూరల రుచి? ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి" అనే సామెతతో పోల్చి చెబుతారు.
అదండీ దర్వీపాకరస న్యాయము అంటే...
 
ఇలాంటి న్యాయాలను మరికొన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం