గుడ్ ఫ్రైడే... !- కోరాడ నరసింహా రావు.
తీవ్రవాది వనియెంచి.... 
  శిలువ వేసి నారు..... 
    దేవునివని గుర్తించి.... 
       నిను ప్రార్ధించేరు... !

నువ్వు  చిందించిన రక్తం 
 పాపుల పాపములు గడుగు 
   పరమ పవిత్రం... !

నీ ఒక్కొక్క వాక్యం.... 
   అమృతోపదేశం.... !
... నీ క్షమా గుణం... 
.    అనుపమానం.... !!

జాలి, దయ, ప్రేమలు 
   మూర్తీభవించిన... 
  దైవకుమారుడవు నీవు 
  పాపుల రక్షించుటకై.... 
  ఇలను నీవు వెలిసావు... 
....బ్రతికివుండగా  నిన్ను 
    గుర్తించని మూర్ఖులము  
    నీవు మరణించిన రోజును 
     గుడ్ ఫ్రైడే అన్నాము ..... 
  ప్రార్థనలు   చేస్తున్నాము.. !! 
         *******

కామెంట్‌లు