సుప్రభాత కవిత ; - బృంద
అపరంజి వెలుగులకు
అపురూపమైన  స్వాగతం
చుక్కలు దిగివచ్చి
రేకులు విప్పుకుంటున్న చందం

ఆకాశం పందిరికింద
అదుపులేని అందంగా
విరబూసిన ఊదాపూలు
అవని మీద హరివిల్లు

కొలవలేని కలిమిలాటి
హృదయసీమ పరవశం
సొగసైన తోటను చూడ
అలుపురాదు  ఏ నిమిషం

చిన్నిపువ్వుల చిరునవ్వులు
వస్తున్న వెలుగు చూసి
విస్తుపోయి కనులు తెరచి
విడ్డూరంగా విరిసిన వైనం

లలిత కోమల లావణ్యం
అలరించు సుగంధం
ఊహకు అందని సౌందర్యం
వేకువకై వేచిన ఉద్యానం

సుదూర తీరాన రేపటి రూపంగా
ఆగమించు ఆశాదీపాన్ని
స్వాగతించు సుమబాలల
శుభోదయ సంభ్రమం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు