న్యాయాలు -102
దామవ్యాలకట న్యాయము
*****
దామ- దాముడు,వ్యాల- వ్యాలుడు,కట- కటుడు- ఇవి ముగ్గురు రాక్షసుల పేర్లు.
వీరి పేరుతో న్యాయము ఏమిటి అనిపిస్తోంది కదూ!
మన పూర్వ తరం వారు వీరిని ఉటంకిస్తూ ఓ న్యాయాన్ని అందులో ఓ సందేశాన్ని ఇవ్వడం విశేషం.
వివరాల్లోకి వెళితే... శంబాసురుడు అనే రాక్షసుడు తనకు సహాయంగా, చేదోడు వాదోడుగా ఉండేందుకు ఈ ముగ్గురు అంటీ దాముడు, వ్యాలుడు,కటుడు అను ముగ్గురు రాక్షసులను తన మాయతో సృజించాడట.
వారు అలాంటి ఇలాంటి వారు కాదట. వారి ఒకే ఒక్క గ్రుద్దుకు పది కొండలు పిండి చేయగల బలము కలిగి యున్నారట.
కానీ ఏం లాభం.వారికి ఆ బలం ఎలా ఉపయోగించాలో తెలియని మూఢులట. అందువల్ల వారు ముగ్గురూ రాన్రాను బలహీనులై చివరకు దోమలై పుట్టారట.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే వివేక శూన్యులకు తమకున్న శక్తిని, బలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు.
అలాంటి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడం అనేది,ఉన్నత స్థాయిలో చూడటమనేది సాధ్యం కాని పని.
"ఇలా అజ్ఞునికి లేదా మూర్ఖునికి ఉచ్ఛదశ వచ్చినా, ఇచ్చినా అథోగతికే మూలమవుతుంది,నిరుపయోగమే అవుతుంది" అనే అర్థంతో ఈ దామవ్యాలకట న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ న్యాయానికి దగ్గరగా ఉన్న వేమన రాసిన పద్యం చూద్దాం.
"హీనుడెన్ని విద్యలిల నభ్యసించిన/ ఘనుడు గాడు మొఱకు జనుడె గాని/ పరిమళములు గర్ధభము మోయ ఘనమౌనె/విశ్వదాభిరామ వినురవేమ!"
హీనుడు లేదా మూర్ఖుడు ఎంతటి విద్యావంతుడైనా అతనిలో మూర్ఖత్వం పోదు.జ్ఞాన సారాన్ని పొందలేడు.ఎప్పటికీ గొప్ప వాడు కాలేడు.గంధ చెక్కలాంటి ఎన్ని సుగంధ ద్రవ్యాలను మోసినా గాడిద ఆ పరిమళాన్ని గ్రహించేంత గొప్పది కాలేదు కదా అని అర్థం.
అక్కడ తమకున్న శక్తిని, బలాన్ని,తెలివి తేటలను ఉపయోగించుకోలేని అసమర్థులు దామ,వ్యాల,కటులైతే,ఇక్కడ తనకు అందివచ్చిన సుగంధ సారాన్ని గ్రహించలేని మూర్ఖ జంతువు గాడిదన్న మాట.ఇలా వచ్చిన, ఇచ్చిన అవకాశాలను మూర్ఖులు సద్వినియోగం చేసుకోలేరని ఈ దామవ్యాలకట న్యాయము ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి