న్యాయాలు -118
నీర నీర న్యాయము
*****
నీరుకు అనేక అర్థాలు ఉన్నాయి.ఉదకము, ద్రవము, జలము మొదలైనవి.
అసలు నీరు అంటే ఏమిటో చూద్దాం.
నీరు అనగానే దానికి సంబంధించిన శాస్త్రీయ సంబంధమైన విషయాలు గుర్తుకు వస్తాయి.నీరు ఒక రసాయన సమ్మేళనమనీ, అందులో ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులను కలిగి ఉంటుందనీ, నీటిని సార్వత్రిక ద్రావకం అని పిలుస్తారని సైన్స్ చదువుకున్న అందరికీ తెలుసు.
అలాగే స్వచ్ఛమైన నీటికి వాసన,రుచి ఉండదని చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం.
అదంతా సైన్స్,శాస్త్రీయతకు సంబంధించిన విషయమైతే,మనమే కాదు జీవరాశి బతకాలన్నా, బతకడానికి అవసరమైన పంటలు పండించుకోవాలన్నా నీరు కావాల్సిందే. నీరు ఉన్న చోటనే మానవ నాగరికతలు వర్థిల్లాయని కూడా తెలుసు.
ఇక అసలు విషయానికి వద్దాం.నీటిలో నీరు కలిస్తే విడదీయ గలమా? అనేది వేల వేల మిలియన్ డాలర్ల ప్రశ్న.
నీటిలో కరిగిన ఉప్పునో, చెడు పదార్థాలనో,మురికినో శాస్త్రీయ పద్ధతుల ద్వారా విడదీయవచ్చు కానీ నీటిలో కలిసిన లేదా కలిపిన నీటిని విడదీయ లేము.
అలాగే నీటి నుండి నీటిని విడదీయలేనట్టే మనిషి మనసు నుండి బుద్ధిని విడదీయలేము అనే అర్థంతో ఈ "నీర నీర న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
సముద్రము నుండి అలలను విడదీయలేనట్టే మనిషి మనిషి మధ్య ఉన్న అనేక రకాల బంధాలను విడదీసి చూడలేం.
చెడు ఆలోచనల మనస్తత్వాలు కలిస్తే వాటిని దీయలేని కారణాలు అనేకం కనబడుతూ, అనర్థాలు అదే స్థాయిలో ఉంటాయి.
అలాగే మంచి ఆదర్శమూర్తులు కలిస్తే వారి వల్ల సమాజానికి మరింత మేలు జరగడం గమనించ వచ్చు.
ఈ విధంగా నీర నీర న్యాయము అంటే మంచి మంచి కలిసినప్పుడు విడదీయలేని మరింత మంచి;చెడు, చెడు కలిసినప్పుడు మరింత చెడు జరుగుతుందనే అర్థంతో ఈ నీర నీర న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి