మనమునందు నిల్చు మాన్యుడతడు!;- కిలపర్తి దాలినాయుడు
 డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా
(125అడుగుల  విగ్రహావిష్కరణ సందర్భం
---------------------------------------
//సీ//
కాంశ్యదేహంబుతో గగనంబుననునిల్చి
బోధించె బుద్ధునిబోధలన్ని!
రాజ్యాంగ నిర్మాణరహదారులనుదెల్పి
ననగారువర్గాలవెనుకనిల్చి!
నంటరానితనంబు కంటకప్రాయంబు
తొలగించవలెనన్నతలపురగిలి!
ప్రకటించె ప్రకరణా నికరంబుప్రజలకై
స్వేచ్ఛా,సమానత జీవితమ్ము!
ఆ.వె.
నీటికుండనాడు నేర్పిన పాఠాలు
గుండె పిండినేమొ గుబులురేపె
బడుగు జీవులకునుబాబసాహేబుగా
మనమునందు నిల్చు మాన్యుడతడు!
---------------------------------------

కామెంట్‌లు