నిన్నటి గాలికి రాలాయి...
రెండుమామిడి కాయలు....
కిట్టు -పొట్టి ఇద్దరూ
ఆట లాడగ వచ్చారు...
ఆమామిడి కాయలు చూసారు
హాయ్ మామిడికాయలూ...
అంటూ... కళ్ళు పెద్దవిచేశారు !
చెరొకటీసుకున్నారు ....,
గట్టుమీద కూచున్నారు !
కిట్టు కాయను
కొరుకుతు ఉంటే
పొట్టి నవ్వుతు చూసాడు !
అంతలోనె తోటమాలి...
రేయ్... అంటూ... కేకేశాడు !
చెడ్డీలు ఎగేసుకుంటూ...
కిట్టూ, పొట్టీ లిద్దరూ....
ఇంటికి పరుగు తీశారు !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి