తేటగీతి మాలికనీ (ప)దాబ్జములన్ బట్టి నిల్చి యుండిగో(ప)కులభూషణా!నిను గొల్తు నెపుడు.వా(సి)గా పూవులన్ దెచ్చి వాంఛ తీరనీ (సి)గకు జుట్టి మురిసెద నీరజాక్ష!వ(డి)వడిగ వచ్చి నీదరి భక్తితోడప(డి)శరణ మంటి గాంచుమా!పరమ పురుష!తా(మ)సంబగు బుద్ధులే తరుము చుండెకా(మ )వాసన ద్రుంచుమా కంబుకంఠ!వి(న)తి మెయి నిను మ్రొక్కెద వినుము మొరలుఘ(న) చరిత్రను గలవాడ!కైటభారి!దా(సు)లన్ బ్రోచు వాడవు దయను జూపు!వి(సు)వు నొందకు నాపైన వేదవేద్య!**********
ప్రాసాక్షరి(ప,సి,డి,మ, న,సు.)-టి. వి. యెల్. గాయత్రి-పూణే. మహారాష్ట్ర.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి