సుప్రభాత కవిత ; -బృంద
కలలు కరిగిన చోట
కన్నుల పంటలు

రాలిన క్షణాల ముంగిట
కలల ముగ్గులు

ఏ క్షణాన ఏ మాయలు
ఎదురవుతాయో?

ఏ మోడు ఏ కారణంతో
చిగురిస్తుందో?

ఏ మనసుకు ఏ వైపు
ఓదార్పు దొరుకుతుందో!?

ఏ వ్యధకు ఎక్కడ
ఏ ఉపశమనమో??

ఏ పలకరింపు ఎవరికి
జీవితాశ కలిగించేనో??

చీకటి మూసిన వాకిట
ఎవరొచ్చి చిరుదివ్వె వెలిగిస్తారో?

ఆగిన ఆశల ఊపిరి
ఏ తొలకరికి జీవం పోసుకుంటుందో?

నిట్టూర్పుల మౌనంలో
ఏ నీలాంబరి జోలపాడేనో!

ఏ కథకు ఏది కొనసాగింపో
ఏది కొత్త మలుపో
దేనికి ఏది కొత్త బ్రతుకో
ఎవరికి తెలుసు????

జీవితం 
చదవక తప్పని పుస్తకం
తప్పక రాయాల్సిన పరీక్ష

కొన్నైనా కోరిన సమాధానాలు
తెచ్చే కొత్త ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు