బాధ్యత! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆపిల్లకాకులు చెట్టుమీద కూచుని ఆచుట్టుపక్కల ఉన్న ఇళ్ళని పరిశీలిస్తున్నాయి.ఆపక్క భవంతిలో ఫంక్షన్ కాబోలు రకరకాల వంటకాలు తయారు అవుతున్నాయి. కాకి పిల్లలకి నోరు ఊరుతోంది.కడుపులో ఆకలి కలకలలాడుతూ ఉంటే అమ్మ నాన్నలతో చెప్పాయి.వెంటనే తండ్రికాకి 
ఆఫలహారాల దగ్గర కూచున్న వ్యక్తితలపై భుజాల పై వాలి సతాయిస్తుంటే తల్లి కాకి ముక్కు తో గారె బూరె కరుచుకుని వచ్చి గూట్లో పిల్లలకి అందించింది. మగకాకి ని ఆవ్యక్తి తరమసాగాడు.అది హఠాత్తుగా గారెల బుట్టలో ముక్కు పెట్టి ఎగిరిపోయింది. ఆడకాకి ఆవ్యక్తిని ముక్కుతో పొడిచి సతాయిస్తుంటే మగకాకి పిల్లల కడుపు నింపింది. ఇలా అమ్మా నాన్న లు గా ఆకాకులు పిల్లలని పోషించడం లో ఎంత సమయస్ఫూర్తి తెలివి ప్రదర్శించాయోకదా?🌹
కామెంట్‌లు