శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఘటవాల్ ఘటవార్ అంటే నది ఒడ్డున ఉండే ఠేకేదార్ లేక కాంట్రాక్టర్. నది దాటడానికి  పన్ను వసూలు చేసేవాడు ఆరోజుల్లో!ఇప్పుడు మనం టోల్ గేట్ కి డబ్బు చెల్లిస్తున్నాంకదా?
హిడింబి భీముడి కొడుకు ఘటోత్కచుడు. అతని తల కుండలాగా నునుపుగా నున్నగా ఉండటంతో ఆపేరు వచ్చింది.తండ్రి అంత బలశాలి. కర్ణుడు  శక్తి  అనే అస్త్రాన్ని ప్రయోగించి ఇతన్ని చంపాడు. వివాహభోజనంబు వింతైన వంటకంబు అనే మాయాబజార్ సినిమా లో శ్రీమాధవపెద్ది సత్యం పాట ఎస్వీ రంగారావు గారి నటన ఇప్పటికీ అందరినీ అలరిస్తున్నాయి కదా?
హిందీ లో ఘరనీ అంటే గృహిణి  ఇల్లాలు అని అర్ధం. 
హిందీ లో ఘరాతీ అంటే వధువు పక్షంవారు.వరుని తరుఫువారిని బరాతీ అంటారు. ఈరెండూ విలోమ శబ్దాలు. 🌸

కామెంట్‌లు