త్యాగాల అఖండ దీపం;-కొప్పరపు తాయారు
తెలంగాణా  ప్రత్యేక రాష్ట్రపు తొలి కేక
1969లో,మలిదశలో వందలాది ప్రాణాలు
బలి ,దశలు మారి దేశం పిక్కటిల్లే
ఐలమ్మల కొమరం భీముల కొన్ని
,
వేలమంది ప్రాణబలి రుధిరతర్పణాల
‌జనబాహుళ్య కేకల బలం నిలిచింది
   
జై తెలంగాణా నినదించిన శబ్ధం
ఎదురు లేని ఎత్తుతో ఎఱ్ఱని విజయ 
జ్వాలలతో గళమెత్తి అరుస్తోంది
                     
 తెలంగాణా అమర జ్యోతి 
 వీరాధి వీరల పోరాట నినాదం 
 ధైర్య సాహసాల త్యాగాల         
గంభీరోత్సాహం చూపుతోంది

తానే నిలిచి వారివిజయ గర్వశక్తి    
అందాలు హుస్సేన్ సాగర్ ఒడ్డున
జంటనగరాల నడిబొడ్డున నిలుస్తాను
మీకై దశదిశలా వెలుగులు నింపుతూ

 మీ దివ్యపథం, జ్ఞాపకాల అమృత
తలపులు అందరి హృదయ కవాటాలు
తట్టి తట్టి జాగృతం చేయ నేనే
ఆవిర్భవించాను తెలంగాణా అమరజ్యోతిగా

నా రూపం , నా జ్యోతి గర్వం ఉట్టిపడేలాపలుకులుఒలికిస్తా తెలంగాణగర్వించేరీతిచాటుతానేనే తెలంగాణాఅమరజ్యోతినీ!

కామెంట్‌లు