గలగలా పారేటి
ఏటి కన్యక అందాలు
కొండల నడుమనుండీ
తొంగి చూసిన సూర్యుడి
చూపు సోకిన చోట
సిగ్గుతో ఎర్రబడుతుంటే...
అలలతో తాకి
ఎదలోని అలజడిని
తీరాన చెలులు శిలలకు
మురిపంగా చెబుతుంటే....
మేలమాడిన శిలల
తప్పించుకుని త్వరత్వరగా
మొగము దాచుకుని
ముసినవ్వులతో ముందుకు
సాగుతుంటే....
ముదముతో నిండిన
ఊత్సాహము అలల తీరున
బయటపడుతుంటే
సరిగమల రాగాలు
పలుకుతూ పరవశాన
పరుగుతీసె ప్రవాహము
హృదయానికి చెవులుంటే
ఉదయరాగమాలికల
హృదయంగమ రవళులు
ప్రతిమనసునూ పలకరిస్తాయి
ఏ పరిస్థితిలో ఉన్నా
ఆనందం సంతోషం మాత్రమే
ప్రకృతికి తెలుసు..
ఎందుకంటే ఏదీ ఎక్కువకాలం వుండదనీ..
చెప్పకనే చెప్పేస్తుంది
కాలచక్రగమనంలో
మరో మధురమైన ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి