తెలుగుజాతీయం.;- తాటి కోల పద్మావతి

 రెండు నాలుకలు.
భౌతికంగా రెండు నాలుకలున్న ఏ జీవియు లేదు. పాముకు ఇతర ప్రాకుడు జంతువులకు, ఉడుముకు రెండు నాలుకలు ఉన్నట్లు గోచరిస్తుంది. కానీ నిజానికి అది ఒకటే నాలుక. అది చీలి రెండు నాలుకలుగా ఏర్పడతాయి. ఇచ్చిన మాట నిలుపుకో లేక మరో విధంగా మాట్లాడేవాడిని రెండు నాలుకలోడు అంటారు. ఈ మాటను రెండు అర్థాలలో వాడుతారు. మొదటిది ఆడిన మాట తప్పిన వాడని, రెండోది రెండు నాలుకల వాడని లోకులు అంటారు. ఒక పూర్వ కవి ఇలా అంటాడు. రెండు నాలుకలు సంప్రదాయకునకున్? లెక్కింపగా ఒక్కటే, గండా గొండి శిఖండి బండనికి లెక్కలేని నాలుకలు గదా"అని ఈసడించుకుంటాడు. మాట పట్టింపు లేని, మాట మార్చే, మాటకు విలువ లేని వాడిని రెండు నాలుకల వాడంటాడు. పరుషంగా, ఆక్షేపణంగా నిండా రూపంలో మాట్లాడే వాడిని గురించి ఈ జాతీయాన్ని వాడుతారు.
ఈ కాలపు చాలామంది నాయకులు ఓట్ల సాధనకు ఎన్నో ఎన్నో వాగ్దానాలు చేసి తప్పించుకుని పదవులు చేపట్టే వారికి కూడా ఈ జాతీయం వర్తిస్తుంది.

కామెంట్‌లు