*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0262)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
శంఖచూడుని తో వీరభద్రుని యుద్ధం - భద్రకాళి దానవరాజుతో భయంకరమైన యుద్ధం చేయడం - అశరీరవాణి ని విని భద్రకాళి యుద్ద భూమి వదలి వెళ్ళడం - విష్ణు దేవుడు రాక్షస రాజుతో యుద్ధం - తులసి శీల హరణం - త్రిశూలముతో శంఖచూడుని వధ - శంఖోత్పత్తి......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! శంకరుని వద్ద నుండి వచ్చిన శంఖచూడుని దూత, శంభుడు పలికిన మాటలు చెప్పగా, దానవరాజు కూడా సంతోషంగా యుద్ధానికి సిద్ధమై తన రథము ఎక్కాడు. పరమేశ్వరుడు కూడా యద్ధ కుతూహలంతో సేనతో కదనరంగం వైపు కదిలారు. రణవాయిద్యముల ఘోష మధ్య మితిమీరిన సమరోత్సాహంతో రెండు పక్షాల సైన్యాలు యుద్ధం మిదలు పెట్టాయి. మహేంద్రుడు, సూర్యుడు, విష్ణువు మొదలగు దేవతలు అందరూ వేరు వేరు దానవ రాజులతో తలపడుతున్నారు. శంభునకు సహాయకులుగా వచ్చిన దేవతలు అందరూ అసుర వీరులతో ధర్మ సమ్మతమైన యుద్ధం చేస్తున్నారు. నందీశ్వరుడు మొదలైన శివ గణములు కూడా సమరోత్సాహంతో ధర్మ యుద్ధంలో భాగమౌతున్నారు. ఇలా కోలాహలంగా ఉన్న యుద్ధ భూమిని చూస్తూ శంభుడు వట వృక్షం చెంత ఉండగా, శంఖచూడుడు కూడా రత్నాలు పొదిగిన తన సిహాసనం మీద కూర్చుని యుద్ధ ప్రగతిని చూస్తున్నారు.*
*మధుపానము చేసి రణరంగములోకి వచ్చిన భద్రకాళి చేసిన వికటాట్టహాసానికి వేలకొలది అసురులు మూర్ఛ పొందారు.  దానవుల పై భద్రకాళి తన కరాళనృత్యము చేయసాగింది. భద్రకాళి తన పై ప్రయోగించిన ఆగ్నేయాస్త్రాన్ని వైష్ణవాస్త్రముతో ఎదుర్కొన్నాడు. అదిచూచి, దేవి నారాయణాస్త్రమును వదిలింది. ఈ అస్త్రమును చూచిన దానవ చక్రవర్తి, తెలివిగా అనేక మార్లు సాష్టాంగ దండ ప్రణామము చేసాడు. ఈ దానవుడు తన పట్ల భక్తితో వినమ్రుడయ్యాడు అనుకుని అస్త్రము తిరిగి భద్రకాళిని చేరింది. తరువాత దేవి వేసిన బ్రహ్మాస్త్రాన్ని దానితోనే నిలువరించాడు. ఇలా కొంతకాలం యుద్ధం జరిగాక దేవి దానవ చక్రవర్తి మీద ముష్టి ఘాతం చేయగా, అతను వెంటనే మూర్చ పోతాడు. మరల లేచిన రాక్షస చక్రవర్తి ని గాలిలోకి ఎగురవేసింది. భుజాలు పట్టకుని గిర గిరా త్రప్పి క్రింద నేలకు వేసి కొట్టినా కూడా ఆ దానవ రాజు తిరిగి లేచి ఆమెకు మాతృ భావంతో మొక్కి తన సింహాసనం మీదకు వెళ్ళి కూర్చుంటఢు.*
*"దేవీ! కాళీ! ఈ యుద్ధ భూమిలో ఒకటిన్నర లక్షల మంది ఇతర దానవులు ఉన్నారు. వారందరిని నీవు నీ ఆహారం చేసుకోవచ్చు. శంఖచూడుడు నీ చెతిలో చంపబడడు. కనుక, నీవు ప్రశాంతతను పొంది, యుద్ధ భూమినుండి వైదొలగు" అని అశరీరవాణి వినిపించింది. అశరీరవాణి వాక్కు ప్రకారం కాళిక, రాక్షసులను సంహరించి, వేడి నెత్తురు ద్రావి, మాంసము తిని వట వృక్షము దగ్గరకు వెళ్ళి, శంకరునికి జరిగిన యుద్ధం అంతా వివరిస్తుంది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు