ఉన్నవ లక్ష్మీనారాయణ. (1873-1958).;-తాటి కోల పద్మావతి


 జాతీయోద్యమాన్ని, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని, సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ఏకకాలంలో నిర్వహించిన ప్రతిభాసాలి. వీరు గుంటూరు జిల్లా సత్తెనపాడు తాలూకా వేములూరుపాడులో జన్మించారు. గుంటూరు క్రిస్టియన్ కళాశాలలో చదివారు. ఎంఏ పాసయ్యారు. ప్లీడరు పరీక్షలో పాసై 1903 నుండి గుంటూరులో ప్లీడరు వృత్తి చేపట్టారు. గాంధీ మహాత్ముని ఆదేశాన్ని పాటించి ఆ వృత్తిని పరిత్యజించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దాదాపు మూడు సంవత్సరాలు కారా గారా శిక్షను అనుభవించారు. 1705 లోనే వితంతు శరణాలయాన్ని నెలకొల్పారు. అంతేకాక 19 22 లో స్త్రీలలో విద్యావ్యాప్తికి 19 22 లో శారదానికేతనము స్థాపించి విద్యా బోధనతోపాటు వృత్తి విద్యలను కూడా స్త్రీలకు సమకూర్చారు. 1910లో ఏలూరులో జరిగిన కృష్ణా గుంటూరు జిల్లాల సంయుక్త సభలో భాషా రాష్ట్రాన్ని కోరుతూ తీర్మానం చేయించారు. అంతేకాక వీరు ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితులను తెలియజేసే'మాలపల్లి'అనే ప్రసిద్ధ నవలను రచించారు. దీనిని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. వీరి సమస్త జీవితం ప్రజా ప్రయోజన కార్యక్రమాల సమాహారం. చివరికి వారు 1958లో మరణించారు.


కామెంట్‌లు