భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880-1959);- తాటి కోల పద్మావతి గుంటూరు

 గాంధీజీ సిద్ధాంతాలకు భాషకారుడు శ్రీ సీతారామయ్య. వీరు 18 80 లో పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో జన్మించారు. 18 98-99 లో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎంబిబిఎస్ చదివారు. 1906 నుండి 19 16 వరకు బందరులో వైద్యవృత్తి చేశారు. బందరు జాతీయ కళాశాల స్థాపకులలో ఒకరు. అలాగే స్వాతంత్రం రాకముందు తర్వాత కూడా తెలుగు వారందరికీ ఒక రాష్ట్రం కావాలని కోరుకున్న వారిలో ప్రముఖులు. వీరు తమ వృత్తిని విడనాడి హోమ్ రూల్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూమెంటులలో పాల్గొని వివిధ జైలలో ఏడున్నర సంవత్సరాలు గడిపిన దీశాలి. అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి 1948 నుండి 50 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. వీరు రాసిన కాంగ్రెస్ చరిత్ర ఇంగ్లీషు, తెలుగు భాషలలో ప్రచురితమయింది. కాంగ్రెస్ చరిత్రపై వెలువడిన ప్రామాణిక గ్రంథం గా దీన్ని భావిస్తారు. కాంగ్రెస్ సందేశాన్ని అందజేయడానికి కొంతకాలం'జన్మభూమి'పేరున ఒక వార్తాపత్రికను నిర్వహించారు. స్వాతంత్రానంతరం 19 52 నుండి 67 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. వీరు 1959లో హైదరాబాదులో పరమపదించారు.

కామెంట్‌లు