*హనుమాన్ చాలీసా - చౌపాయి 4*
 *శ్రీ శోభకృత, వైశాఖ బహుళ దశమీ, ఆదివారం - 14.05.2023,  హనుమజ్జయంతి శుభాకాంక్షలతో*
*కంచన వరణ విరాజ సువేశా!*
*కానన కుండల కుంచిత కేశా!!*
తా: ఆంజనేయా! హనుమా! నీవు బంగారు రంగు శరీరము లిగి ఉన్నావు. మంచి బట్టలు కట్టుకుని అందంగా ఉంటావు. బంగారం తో చేసిన కుండాలాలు చెవులకు ధరించావు. నీ తల వెంట్రుకలను ముడి వేసుకుని ఉంటావు.........అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం: పవన సుతుని రూపం చాలా అందంగా ఉంటుంది. చూచే వారు చూపు తిప్పుకోలేనంతగా. ఎంత సౌందర్యవంతుడు కాకపోతే, సముద్ర లఘంనం చేసేటప్పుడు ఒకరు కాదు, ఇద్దరు దానవ అతివలు, సముద్ర కన్య, ఆయన మార్గాన్ని అడ్డుకుంటారు, చెప్పండి. ఏది ఏమైనప్పటికీ నిర్ద్వందంగా ఆంజనాసుతుడు, అందగాడే, మనసులో, రూపంలో, ప్రవర్తన లో కూడా. ఈ సందర్భానుసర మాటకారి వాక్చాతుర్యానికి, ఒక నిమేషకాలం రావణ చక్రవర్తి కూడా వశుడు అయిపోతాడు. ఏక్షణంలోనైనా, రామ వాక్కు కోసం సిద్ధంగా ఉన్నాను అనిచెప్పడానికి, తన జుత్తు ముడి వేసుకుని, నడుముకు ఉత్తరీయం చుట్టుకుని కటిబద్ధుడై ఉండే ఉంటాడు. ఇక్కడ, మన యువత నేర్చుకోదగిన విలువైన విషయం ఏమంటే, మన గురువులు, కార్యస్థలంలో అధికారులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు నుండి అయినా ఏక్షణానైనా వచ్చే ఆదేశం పాటించడానికి సంసిద్ధంగా ఉండడం. అలా సిద్ధంగా ఉన్న యువతకు కానీ, ఏ వ్యక్తి కి అయినా కానీ అపజయం దగ్గరకు రాదు. ఇది నిజంగా నిజం. ఆంజనేయుని సాక్షిగా! ఇటువంటి సంసిద్దతను మనకందరకు కరుణించమని.........ఆంజనేయుని తలపులలో నిత్యం కొలువున్న సీతా మనో వల్లభుని వేడుకుందాము.*
*ఆఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు