ముత్యాల హారం వేదిక
మన కోసమే ఇది కనుక
హారాలను రాయండిక
ఇక మీరెన్నడు మరువక !
మా కవి మిత్రులు వినండి
మా మంచి మాట ఇదండి
ఇక హారాలను అల్లండి
గుమ్మానికి వేసి వెళ్ళండి !
ఇరుగు పొరుగు సేవ ఇది
మనం పాటిస్తే మంచిది
మంచి పేరు మీకొస్తూంది
ఆనందాన్ని ఇస్తుంది !
మీరు హారాలను వ్రాసి
ముఖద్వారాలకు కట్టేసి
ముందర ముగ్గులు పెట్టేసి
కావాలి మీరు సాహసి !
సహచర కవుల పిలవండి
బాసటగాను నిలవండి
హారాలనూ నేర్పండి
అందాలనూ కూర్చండి !
వేదిక పరిచయం చేసి
భారం మనము మోసేసి
అంతా సిద్ధం చేసేసి
చూపించాలి పేర్చేసి!
ఈ వేదిక ప్రసిద్ధం
కావాలిక సంసిద్ధం
కాదులే మరి నిషిద్ధం
ఇందులోన నివసిద్ధం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి