వెన్నెలమ్మ ముద్దు పిల్లలం
వన్నెలున్న బొద్దు మల్లెలం
వేస్తాంలే ఎత్తుకు పై ఎత్తు
ఎవరినైనా చేస్తాం ఇక చిత్తు !
కుశాగ్ర బుద్ధి ఉన్నవారలం
దేశాభివృద్ధి కోరు పోరలం
సకల శాస్త్రాలు చదివాం
సకిలీ కంతో మేం ఎదిగాం !
వ్యవసాయం ముద్దుల చేస్తాం
పలసాయం ఖుద్దుగా తీస్తాం
అప్పుల తిప్పలు తప్పిస్తాం
ఒప్పగ అందరిని మెప్పిస్తాం!
ఆటపాలనతో ఆడుకుంటూ
పని పాటలు మేం చేసుకుంటూ
అక్షరాలను ముద్దుగా దిద్దుతాం
లక్షణంగా చిత్రాలను అద్దుతాం !
బడిలో గురువును అర్థిస్తాం
గుడిలో మా దేవుని ప్రార్థిస్తాం
చదువుల వరమును కోరుతాం
పదవుల తీరము ఇక చేరుతాం!
గురువుల వెంటే ఉంటాం
గురు బోధనలనే వింటాం
చదువుల మధనం చేస్తాం
పదవుల వదలం చూస్తాం!
అభ్యాసం కూసువిద్య వచ్చేలా
సభ్య సమాజం మమ్ము మెచ్చేలా
సత్య పథ మందు మేం చరిస్తాం
సత్ఫలితం పంది ఇక తరిస్తాం !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి