ముత్యాల హారాలు!;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ముద్దు ముద్దు హారాలు
మన ముత్యాల హారాలు
ఆ హారాల అందాలు
చిందించేను గంధాలు!

హారంలోన మణులు
ఉన్నాయని పురజనులు
తీసుకొని ఐరి ఘనులు
వారు మెరిసే ఇనులు !

మంచి ముత్యాలతో పాటు
పగడాలకు ఇందు చోటు
కల్పించుటకు వారు బీటు
వేసి సాధించిరి  సీటు !

ముత్యాలు రత్నాలు ఉన్నవి
మిల మిలా మెరుస్తున్నవి
హారమందు దాగున్నవి
అందుకోండి అంటున్నవి !

ఇవి తెలుగోడి గళ మందు
చేస్తాయిక కనుల విందు
అవి అందరికీ పసందు
ఔతాయిక ముందు ముందు !

తెలుసుకొనిక మీరు కూడ
ముత్యాల హారాల జాడ
తీసి అల్లండి పూదండ
ఇవ్వండి మీ అండదండ !

ఇరు రాష్ట్రాల మన జనం
ఈ గ్రూపుల ప్రతి దినం
చేరి చేస్తారు గానం
విని ఇవ్వండి బహుమానం !

అప్పుడు వారికి ముదము
వారి కుండదిక ఖేదము
అల్లేరు ముత్యాల హారము
తీస్తారు గ్రూపు ద్వారము !


కామెంట్‌లు