జంతూ నామ్ నరజన్మ ఉత్తమం అని ఎందుకు అన్నారు ఎదుటివారు ఏదైనా చెప్పినప్పుడు దానిని గ్రహించి అర్థం చేసుకొని దానికి తగిన సమాధానం చెప్పడానికి తన మనసును ఉపయోగించి సమాధానం చెప్పే స్థితి ఒక్క మానవులకు ఉన్నది కనుక ఈ భౌతికంగా లేక పోయినట్లయితే ఆధ్యాత్మికం లేదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. భగవంతుడు ఉన్నాడా లేడా దేవుని నువ్వు చూసావా లేదా ప్రశ్నలు వృధా దేవుడంటే జ్ఞానమును ఇచ్చువాడు అది నీ సొంతం భగవంతుడు అంటే వెలుగును చూపేవాడే అంతే తప్ప వారి ఆకారాలు ఎవరికీ తెలియవు ఒక శక్తి అతీతమైనది ఉన్నది అని ప్రతి ఒక్కరికి అనుభవాల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఆ శక్తి గనుక లేకపోతే ఈ ప్రపంచమే లేదు ప్రపంచము అంటే శరీరము అని అర్థం కూడా ఉంది. ఈ ప్రపంచంలో ఏ పని చేయాలన్నా దీనితోనే పని పూర్తి చేయవలసి ఉంటుంది మానవుడికి సాధ్యం కానిది పట్టు పట్టి కృషి చేస్తే సాధించలేనిది ఈ జగతిలో ఏది లేదు అన్నది నానుడి భౌతికమైన సుఖాలను అన్నిటిని అనుభవించిన తర్వాత అసలు ఈ జన్మకు సంబంధించిన రహస్యం ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలి అన్న కుతూహలం చాలా మందిలో ఉంటుంది కానీ ఆ తెలుసుకొనే మార్గం ఏంటో దానిని గురించి తెలియజేసే గురువు ఎవరో తెలుసుకొని దాని రహస్యం మన సొంతం చేసుకుని ప్రయత్నించినప్పుడు తప్పకుండా ఇందులో ఏ విధమైన అనుమానానికి తావులేదు అని చెప్తున్నాడు వేమన ఆధ్యాత్మిక చింతన వచ్చినప్పుడు మన వాళ్ళు చెప్పే విషయం బ్రహ్మ సృష్టిస్తాడని విష్ణువు పెంచుతాడని శివుడు ప్రణాళికా బద్ధమైన జీవితాన్ని ఇస్తాడు అని నమ్మకం. నీకు పుణ్యలోకాలు ఇవ్వడానికి దేవతలను ప్రార్థించమని గురువు చెప్పినప్పుడు మొదట మనం ప్రార్థించేది బ్రహ్మను వారిని ప్రార్థించినప్పుడు వారే వస్తాడు తప్ప వారి భార్య సరస్వతి దేవి రాదు అలాగే విష్ణుమూర్తిని ధ్యానించినప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకు కావలసిన వరాలు ఇస్తాడు అంతే తప్ప ప్రక్కన లక్ష్మీదేవి మనకు కనిపించడానికి రాదు అదే శివపార్వతులను ధ్యానించినప్పుడు శివుని ధ్యానించినప్పుడు పార్వతి, పార్వతి ధ్యానించినప్పుడు శివుడు ఇద్దరూ కలిసే మనకు ప్రత్యక్షమై మనకు కావలసిన వరముల నన్నిటినీ ప్రసాదించి వెళతారు కారణం వారు అర్ధనారీశ్వరులు అందుకే పెద్దవారి సలహా శివ నామాన్ని మించిన నామం మరొకటి లేదు మోక్ష ప్రాప్తి కోసం దానిని ఆరాధించండి అని చెబుతారు దాని గురించి వేమన వ్రాసిన ఆటవెలది ఒక్కసారి చదవండి.
"శివుని యనుభయంబు సృష్టి లోపల లేక సంశయంబు చెడదు సాధకులకు చెంగు దివ్వెలేక చీకటి వాయునా..."
"శివుని యనుభయంబు సృష్టి లోపల లేక సంశయంబు చెడదు సాధకులకు చెంగు దివ్వెలేక చీకటి వాయునా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి