మానవ జీవితం సుఖమయంగా సాగాలి అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి తల దాచుకోవడానికి ఇల్లు ఉండాలి శరీర రక్షణ కోసం దుస్తులు ఉండాలి అన్నిటికన్నా ముఖ్యం ఆహారం భోజనం లేకపోతే ఈ జీవి బ్రతకడం కష్టం ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా మరే పనిచేసినా కావలసిన ఆహార పదార్థాలను మనం విపణి లో ధర చెల్లించి వస్తువులను తెచ్చుకుంటాం సంసారం హాయిగా సాగిపోతూ ఉంటుంది డబ్బుతో కొన్న ఆ వస్తువులు ఎలా తయారవుతున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి దానికోసం ఎవరు కృషి చేస్తున్నారు అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించినట్లయితే అసలు విషయం మనకు అవగతం అవుతుంది. వ్యవసాయం చేస్తున్న వారిని రైతులు అంటారు వాతావరణానికి అనుకూలంగా ఎప్పుడు ఏ పంట పండుతుందో దానిని తెలుసుకొని దానిని పండిస్తారు. పంటలు పండడానికి ముఖ్య వనరులు ఏమి కావాలో దానిని సమకూర్చుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలి రైతు ఏ పంట పండడాని కైనా దానికి నీరు తప్పకుండా ఉండాలి ఆ నీరు చివరి వరకు రావడానికి మార్గాలు ఏమిటి చేనుకు దగ్గరలో కాలువలు ఉంటే ఆ కాలువలో నుంచి నీరు తీసుకోవడం జరుగుతుంది అదే చెరువుల కింద పండే పంటలు అయితే ఆ చెరువులో నీరు ఎంత ఉంటే ఎన్ని ఎకరాలు సాగు చేయడానికి సరిపోతుంది అన్న విషయాన్ని సమగ్రంగా ఆలోచించుకొని దానికి తగినట్లుగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. పొలాన్ని దున్ని సాగు చేయాలి ఆరుగాలం కుటుంబం మొత్తం ఎంతో కష్టపడి పంటను రక్షించుకుంటూ ఫల సాయాన్ని పొందిన తరువాత మనం హాయిగా ఇంట్లో కూర్చుని భోజనం చేస్తున్నాం. చెరువులు కాలువలు లేనివాడు ఒక బావిని తవ్వడానికి ఏర్పాటు చేసుకోవాలి రాతినేల అయితే ఎంత ప్రయత్నం చేసినా అక్కడ నీరు పడదు పల్లపు ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటే మీరు పుష్కలంగా ఉంటుంది ఎలా చేయాలో దానిని ఎలా నిర్ణయించాలో రైతుకు తెలియదు ఆ విషయంలో నిష్ణాతులై అంతకుముందు ఎన్నో బావులను తవ్వించి రైతులకు సహకరించిన తల్లపు రెడ్డి శ్రీనివాస రెడ్డి గారి లాంటి వారిని సంప్రదించి వారు ఏ స్థలంలో ఏర్పాటు చేసుకోమంటారో తెలుసుకొని వారు నిర్ణయించిన తర్వాతనే పనికి ఉపక్రమించాలి లేకుంటే డబ్బుకు డబ్బు వృధా బావి తయారు కాదు అనుభవిజ్ఞులు రెడ్డి గారి లాంటి వారి సలహా మేరకు చేస్తే అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అంటారు వేమన ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.
"బండమీద చెలమ పాటించి తవ్విన నలయికెక్కుడౌను యాసలేదు గుంట పట్టు చెలమ కుల ముద్దరించురా..."
"బండమీద చెలమ పాటించి తవ్విన నలయికెక్కుడౌను యాసలేదు గుంట పట్టు చెలమ కుల ముద్దరించురా..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి