పిల్లలం;- సి.హేమలత-పుంగనూరు
బుడుగులం పిడుగులం
అల్లరిపిల్లలం
ఆటలం పాటలం
చిన్నారి పాపలం

పువ్వులం నవ్వులం
సీతాకోకచిలుకలం
రంగులం హంగులం
హరివిల్లు అందాలం

రాతలం గీతలం
చిట్టి చిట్టి బొమ్మలం
ఎగెరెదం ఎదిగెదం
భారతమ్మ పిల్లలం

శూరులం ధీరులం
వెలుగుపంచు దివ్వెలం
చేయి చేయి కలిపెదం
కలిసిమెలిసి ఉండెదం




కామెంట్‌లు