సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -122
నౌశకట న్యాయము
    ****
నౌ అంటే నౌక లేదా ఓడ అని అర్థం. శకటము అంటే బండి ,అరదము,తేరు,ఒక సేనా వ్యూహము అనే అర్థాలు ఉన్నాయి. 
'ఓడలు బండ్లు కావచ్చు - బండ్లు ఓడలు కావచ్చు' అనే అర్థంతో ఈ న్యాయమును  చెబుతుంటారు.
'ఓడలు బళ్ళు- బళ్ళు ఓడలు'అనే సామెత తెలుగులో కూడా ఉంది.
ఈ  న్యాయము /సామెత  వెనుక ఓ కథ కూడా ఉంది. పూర్వకాలంలో వ్యాపారులు రెండు రకాలుగా ఉండేవారు. చిన్న వ్యాపారస్తులు తమ కున్న చిన్న చిన్న బండ్ల మీద ఒక ఊరి నుండి మరో ఊరు తిరుగుతూ వ్యాపారం చేస్తుండేవారు.
ఇక బాగా డబ్బు ఉన్న వ్యాపారులు తమ వస్తువులను పెద్ద మొత్తంలో ఓడల ద్వారా  సముద్ర మార్గంలో దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్లి   వ్యాపారం చేసేవారు.
అలా వెళ్ళినప్పుడు ఒకోసారి తుఫానులు లాంటి ప్రమాదాలు సంభవించేవి.తాము తీసుకుని వెళ్తున్న ఓడల్లోని సరుకంతా సముద్రం పాలై పోయేది.  ఆ విధంగా చాలా నష్టపోయే వారు.అంత పెద్ద వ్యాపారులు చిన్న  బళ్ళమీద వ్యాపారం చేసుకునే పరిస్థితులు వచ్చేవి.
ఇక బండ్ల మీద తిరిగే చిన్న వ్యాపారులకు కాలం కలిసొచ్చి ఓడల మీద తిరిగి వ్యాపారం చేసేంత స్థాయికి ఎదిగేవారు.
ఇలా మన కళ్ళముందే కొందరు వ్యక్తులు అత్యున్నత ఆర్థిక స్థితి నుంచి పేదరికం దారిద్య్రంలో మునిగి పోతే 'ఓడలు బళ్ళు' అయినాయని అంటారు. 
ఓడ చాలా ఖరీదైన వాహనం.బండి తక్కువ ఖరీదు గల వాహనం. అంటే ఒకప్పుడు ఓ  బాగా బతికిన స్థాయి నుంచి చితికి పోయి తిండికి కూడా అల్లాడే పరిస్థితి అంటే అతి పేదరికాన్ని అనుభవిస్తున్నప్పుడు  ఈ మాట ఉపయోగిస్తూ ఉంటారు.
అలాగే 'బండ్లు ఓడలు అవడం' అంటే  అతి పేదరికం, సామాన్య స్థితి నుండి ఆర్థికంగా బాగా ఉన్నత స్థాయికి చేరుకోవడం.అలా చేరుకున్న వ్యక్తులను, కుటుంబాలను ఉదహరిస్తూ వారి దశ తిరిగిందని 'బండ్లు ఓడలుగా' మారటం అంటే ఇదేనని అంటూ ఉంటారు.
 'కూర్చుని తింటే కొండలైనా తరుగుతాయనీ' ముందు ఆలోచన లేకుండా    చేజేతులా ఉన్నదంతా పోగొట్టుకునే వారు కొందరైతే, విధి వైపరీత్యం వల్లనో అనారోగ్యాల వల్లనో, అతి మంచి తనం తో చేసిన దాన ధర్మాల వల్లనో ఉన్నదంతా ఊడ్చుకొని పోయి  బికారులుగా  మిగిలి పోయి అష్ట కష్టాలు పడటం చూస్తూ ఉంటాం. అలాంటి వారిని చూస్తుంటే ఎవరికైనా 'ఎట్లా బతికేవారు ఎలా అయిపోయారు' అనే బాధ కలుగుతుంది.
అలాగే తమ తెలివితేటలతోనో,పొదుపు,మదుపు, యుక్తితోనో, చిన్న చిన్నగా  తమ ఆర్థిక స్థోమతను పెంచుకుంటూ  ఉన్నత స్థితికి చేరే వారిని చూస్తుంటే' ఔరా!' అనే ఆశ్చర్యం కలుగుతుంది.
కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదని , జీవితాలు తారుమారు అవుతుంటాయని చెప్పడానికి ఈ 'నౌక శకట న్యాయమే' చక్కని ఉదాహరణ.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం