కన్నీరు ఒక రోజు
పన్నీరు అవుతుంది
పెరుగును చిలకగా
వెన్న ఉద్భవిస్తుంది
అమావాస్య పిమ్మట
పున్నమి వచ్చు రీతి
కష్టసుఖాలు మదిలో
కలకాలం ఉండవు
తినగ తినగ వేము
తీయగా మారినట్లు
కష్టాలు భరిస్తే!!
సుఖాలకవే మెట్లు
అపజయాలు ఒక రోజు
విజయాలు అవుతాయి
బాల్యాన తప్పటడుగులు
నడకను నేర్పినట్లు
సహజమే బ్రతుకులో
సాధకబాధకాలు
ఘోషించే కడిలిని
మామూలు ఆటుపోట్లు
చెట్టుకు వేరు వోలె
ఆత్మవిశ్వాసమే
ఎదుగుటకాధారం
మదిని అలంకారం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి