సంస్కారం (చిట్టి వ్యాసం);- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 సద్గుణాల సమాశ్రయమే సంస్కారం. ఉదాత్త ఆదర్శాల అనుగమనమే సంస్కారం.
ధర్మనిరతి,త్యాగనిరతి,సద్గుణసంపత్తి, సంస్కృతీసంప్రదాయాల అనురక్తే సంస్కారం.
మాతృ పితృ గురు భక్తియేకాదు, మాతృభాష మాతృభూమి పర్యావరణపు భక్తి, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, వివేకం, నీతినియమాల సారమే సంస్కారం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే సార్వకాలిక మానవతా విలువలతో నిర్మింపబడిన
మానవతాసౌధము ఈ సంస్కారం. హేతుబద్ధ, సమతా మమతా విశాల మానవతా భావాల సుమనోహర ఉద్యానవనమే సంస్కారం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు, ధర్మైకజీవనం, సమాజ ఆచారాలు, సార్వకాలిక ఆదర్శాలు, నైతికవిలువల సమాహారమే సంస్కారం. ఎంత చదువుకున్నా ఎంత అనుభవజ్ఞానమున్నా సంస్కారం లేని మానవుడు పరమరాక్షసుడే సుమా! అందుకే, సత్ సంస్కారంతో ప్రతి హృదయం ఒక మాతృమూర్తి కావాలి. ప్రతి మనిషి కనురెప్పలు గుడితలుపులు కావాలి. అప్పుడే మానవునికి మహోజ్వల భవిష్యత్తు సాధ్యం!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు