ఆ రోజుల్ల్లో - జయా
 స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో నాకు గుర్తుండి ఒకటి రెండు సార్లే ఫస్ట్ బెంచీలో కూర్చున్నాను. 
ఎప్పుడూ లాస్ట్ బెంచీ లేదా లాస్ట్ నుంచి ముందర బెంచీలోనే కూర్చునే వాడిని.  అందుకు కారణం మాష్టార్లంటే భయమే.
అంతేకాదు, సబ్జెక్టులమీద పట్టూ ఉండేది కాదు. నా అంతట నేను లేచి ఎప్పుడూ జవాబు చెప్పిన పాపానికిపోలేదు. నన్ను మాష్టార్లు అడక్కుండా ఉంటే చాలనుకునే వాడిని. 
ఎందుకనో చదువుమీద ఇంట్రెస్ట్ కలగలేదు.
కాలేజీలో కూడా అంతేసంగతులు. 
స్కూల్లోనేమో తెలుగు మీడియం. 
కాలేజీలోనేమో ఇంగ్లీషు మీడియం. 
ఏమీ అర్థమయ్యేది కాదు. ఏదో లాగించేశాను చదువుని ముప్పై ఆరు శాతం మార్కులతో.
ఇప్పుడెందుకో ఒకటి తరగతి పాఠ్యపుస్తకాలు చదవాలని ఆశ.  అందులోనూ తెలుగు పుస్తకాలంటే మరీ ఇష్టం.
చదవాల్సిన సమయంలో చదువుకోని నాకిప్పుడు చదవాలని ఆశ కలగడమేంటో....అదీనూ ఒకటో తరగతి పుస్తకం.

కామెంట్‌లు