" కోరిక ";- కొప్పరపు తాయారు
 పాట లోన పల్లవి నై
గీతలోన  రాతనై 
గానము  లోన పాట నై 
చేతిలోన కార్యము నై 
స్నేహములోన ప్రాణము నై
ప్రేమ లో బంధమునై.
ఆత్మీయత లోన అనుబంధము  నై
జీవితము లోన  జీవము నై 
నుదిటి రాత భవిత నై 
కాలము లోన శక్తి నై 
శాంతి లోన భావము నై 
జగతిలో నా వెలుగు నై 
మనసులో న మమత నై 
నీలోన  రూపమై
సదా నీ. చెంత నుండ
కోరికై మనెద

కామెంట్‌లు