అంతర్జాలము(ఇంటర్నెట్) (ఒక యోగము-ఒక భోగము-ఒక రోగము) చిట్టి వ్యాసం);- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అగ్గిపుల్లా అంతర్జాలమూ రెండూ సమమే. రెంటితోనూ మంచీ, చెడూ జరుగుతాయి. ఐతే, అగ్గిపుల్ల కంటే అంతర్జాల పరిధి, విస్తృతి ఎక్కువ.
అంతర్జాలంలో సమస్తవిజ్ఞానం ఇమిడి ఉంది అంటున్నారు. "అన్నీ ఇందులోనే ఉన్నాయిష" అంటూ కొందరు ప్రకటిస్తున్నారు కూడాను. దీనిలోకి విషయం ప్రవేశపెడితేనేకదా, ఇందులో ఉండేది! అంటే..., అంతర్జాలంలోనికంటే
బయటే ఎక్కువజ్ఞానం ఉందని ఒప్పుకున్నట్లేగా! ఎవరైనా ఇందులో నిక్షిప్తమైన మంచిని గ్రహించి పరమహంస గా మారవచ్చు. కాని, ఈజాలంలోని చెడులో చిక్కుకుని పరమ హింసాత్మకులయి సమాజంతో ఆటలాడుకుంటున్నారు. దొంగతనాలూ, దోపిడీలూ, మానభంగాలూ, హింసలూ
అబ్బో! ఎన్నో అందులోనుండి నేర్చుకునిమరీ సతాయిస్తున్నారు. ఒకవ్యక్తి దగ్గర అంతర్జాలం ఉండడం ఒక యోగం. దీనిని సద్వినియోగం చేసుకోవడం ఒక భోగం.
మరి, దుర్వినియోగం చేయడం ఒక రోగం!!!
++++++++++++++++++++++++++++

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
👏👏👏🌹🙏🌹చాలా బాగుంది చిట్టి వ్యాసం సార్.