"మౌనం సంగతి చూడు";- - యామిజాల జగదీశ్
 రమణాశ్రమంలో భక్తులు, శిష్యులు, సాధకులు ఉండేవారు.  
భక్తులు ఎప్పుడూ అలాగే ఉండేవారు.  వారెప్పుడూ ఏమీ పెద్దగా చెప్పేవారు కాదు. తమలో తాము లీనమైపోయేవారు. 
కానీ శిష్యులు, సాధకులు తరచూ ఒకరితో ఒకరు గొడవ పడుతుండేవారు.  
ఓ భారతీయుడు శిష్యులతో చాలా గొడవపడేవాడు. అతను అందరిలోనూ ఎప్పుడూ ఏదో  తప్పు వెతికి దానిని భూతద్దంలో చూపిస్తూ గొడవపడేవాడు.
అక్కడితో ఆగకుండా  రమణమహర్షి దగ్గరకు వెళ్లి, ‘ఫలానా వ్యక్తి అలా చేస్తున్నాడు. ఫలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు" అని ఎవరో ఒకరిమీద ఏదో ఒక ఆరోపణ చేస్తుండేవాడు.  
అతను చెప్పినదంతా విన్నాక రమణ మహర్షి, ‘నువ్వు ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చావో గుర్తు పెట్టుకో. మౌనంగా ఉండటం కోసం వచ్చావు. ఆ మౌనాన్ని సాధించే మార్గాన్ని చూసుకో చాలు. మిగిలినవి నీకనవసరం" అని చెప్పేవారు.
 రాబర్ట్ ఆడమ్స్ అనే విదేశీయుడొకరు అరుణాచలమొచ్చి భగవాన్ భక్తుడిగా మారి అక్కడి అనుభవాన్నిలా రాసుకున్నారొక చోట.

కామెంట్‌లు