నవ్వులదినోత్సవం ;- కోరాడ నరసింహా రావు
     😃😃😃😃😃
నవ్వు.... !
  నువ్  నవ్వతే....., అంతటా 
   ఆనందం, సుగంధం లా        పరిమళించాలి ! 

నీ అవయవంలోని అణువణువూ... 
  పులకరించాలి.. !

రుగ్మతలన్నీ మాయమై... 
  ఆరోగ్యం సాక్షాత్కరించాలి !

నీ నువ్వెప్పుడూ.... 
  విరిసిన పువ్వులా.... 
    పసిపాప నవ్వులా.... 
      స్వచ్ఛంగా ఉండాలి !

నువ్వు నవ్వితే.... 
  నీచుట్టూ ఉన్నవాళ్ళంతా 
    ఆనందంగా నవ్వాలి !
      ఏ ఒక్కరూబాధపడరాదు!!

పదుగురునీ... 
  నవ్వించటం కోసం... 
    మిత్రుడ్ని నవ్వులపాల్జేస్తే 
      వాడు, స్నేహితుడే కాడు !

నవ్వించటంకోసం... 
  ఏ ఒక్కరినీ నొప్పించకు... 
   నవ్వుల పాల్జేయకు !
     నవ్వుల పాలవుతావ్ !!

 ఆనందంతో... 
  స్వచ్ఛంగా నవ్వుతూ... 
    అందరినీ  నవ్విస్తూ... 
      ఆరోగ్యంతో జీవించు !!
      *******

కామెంట్‌లు