ఉపాయము ; శ్రీరేఖ , కెనడా

 ఒక రాజు కృతవర్మ వేటకు వెళ్ళాడు. ఆయనకు వేటాడాలంటే చాలా ఇష్టం గా   ఉండేది. 
అతని భార్య లీల కు జంతువులను పక్షులను వేటాడటం ఏమాత్రం ఇష్టం లేదు. ఎన్ని సార్లు చెప్ప్పినా రాజు వినిపించుకోలేదు. ఈ సారి వేటకు వెళ్లి రెండు తెల్లని పావురాలను వల వేసి పట్టుకొచ్చ్చాడు. వాటిని తన తోటలో ఒక బోనులో  వేసి ఒక సేవకుడికి వాటికి ప్రతి రోజు దాణా వెయ్యమని ఆదేశించాడు. 

ఒకనాడు రాణి ఆ తోటలోకి వచ్చ్చి ఆ పావురాలను చూసింది. వెంటనే ఆమె హృదయం కరిగింది. వాటిని ఎలాగైనా సరే విడిపించాల్సిందని ఆమె అనుకుంది. మరునాడు సాయింత్రము సేవకుడు దాణా వేయడానికి వెళ్తుంటే రాణి అతనిని సమీపించి ‘ఈ రోజు నేను దాణా వేస్తానులే. నువ్వు వేరే పని చూసుకో అంది’. సేవకుడు అలాగేనని వెళ్లి పోయాడు. వెంటనే రాణి ఒక బోనును తెరచి దాణా వేయబోతూ బోను తలుపును బార్లా తెరిచింది. దానితో ఆ పావురం బయటికి ఎగిరి  పోయింది.  
అంతలో రాజు కృతవర్మ షికారుకు తోటలోకి వచ్చ్చాడు. ఖాళీగానున్న బోనును చూసే కంగారుగా పావురము గురించి ప్రశ్నిoచడానికి సేవకుడిని పిలవబోగా అక్కడ రాణి కనిపించి ‘రాజా మీరు కూడా షికారుకు వచ్చారా ‘ అని చిరు నవ్వులు చిందించింది. రాజు ‘రెండు పావురాలుండాలి. ఒకటే ఉన్నదేమిటి. సేవకుడిని పిలుద్దామనుకుంటున్నాను’ అన్నాడు. దానికి రాణి ‘ మీకు ఆ చింత అవసరం లేదు. ఆ పావురం సంగతి నేను చెబుతాను. ఈ రోజు దానికి నేను దాణా వేసాను. కానీ దాణా వెయ్యబోయేటప్పుడు ఆ పావురం ఎగిరి పోయింది అన్నది. దానికి రాజు ‘సేవకుడు రోజు వేస్తున్నాడు. నువ్వు ఒక్క రోజు వేసినందుకే ఆ పువురం ఎలా ఎగిరి పోయింది’ అని అడిగాడు. దానికి రాణి ‘రాజా నేను దాణా దానికి ఎలా వేసానో చూపిస్తాను’ అని రెండవ పావురం దగ్గరకు వెళ్లి దాని బోనును కూడా పెద్దగా తెరవడంతో ఆ పావురం కూడా ఎగిరి పోయింది. రాణి కావాలనే పావురాలను వదిలిపెట్టాలని ఉద్దేశ్యం తోనే ఈ ఉపాయము చేసిందని రాజు తెలుసుకొని రాణి సమయ స్ఫూర్తికి చిరు నవ్వులు చిందించాడు.

కామెంట్‌లు