తాత జి.కె.ప్రశ్నలు కొన్ని అడిగి" మీరు ఎవరిగురించైనా చెప్పాలను కుంటున్నారా?" అని ప్రశ్నించాడు. శివా అన్నాడు "తాతా! ఈరోజు ఒకపేపర్ లో చదివాను. 5వక్లాస్ చదివే ముంబై కి చెందిన 10ఏళ్ళ చిన్నారి రిదం మమానియా ఎలాంటి శిక్షణ లేకుండా ఎవరెస్ట్ బేస్ క్యాంపు దాకా ఎక్కింది. 5364 మీటర్ల ఎత్తు ని ఆచిన్నారి ఎక్కి అతి చిన్నవయసు పర్వతారోహకురాలిగా రికార్డు సృష్టించింది.ఎవరెస్ట్ కూడా ఎక్కి నాతడాఖా చూపుతా అంటోంది. ఆపాప ముంబైలోని శాస్త్రి గార్డెన్ పార్కులో మెట్లు ఎక్కి ట్రెక్కింగ్ ప్రాక్టీస్ చేసింది. తిరుగుప్రయాణంకూడా నడకతోనే! మిగతా వారంతా హెలికాప్టర్ లో వచ్చారు. ఈపాప అమ్మ ఉర్మీ నాన్న హర్ష కూడా ఈమెతో ప్రయాణం చేశారు. 11రోజుల ఈయాత్ర మైనస్10డిగ్రీల టెంపరేచర్లో సాగింది. తన 5వ ఏటనించే ట్రెకింగ్ లో పాల్గొన్నది.స్కేటింగ్ కూడా చాలా ఇష్టం. తనతో తీసుకుని వెళ్లిన ప్లాస్టిక్ సామాన్లు తిరిగి తెచ్చి కాట్మండులో చెత్తకుప్పలో పడేసింది." శివా ముగించాడు.తాత అన్నాడు "మీరు రోజు ఓగంట చదువు ఓగంట తోటపని అంటే "టి.వి.చూస్తాం "అని మొండికేస్తారు.మీకున్న పరిధిలో కథ కవిత వ్యాసం మీకు తోచింది రాయండి " అనగానే అలాగే తాతా అంటూ పిల్లలు పొలోమని అరిచారు. 🌹
రిదం మమానియా! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి