యోచన చేయుము!!- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
పుస్తకాలు చదివితే
మస్తకాలు వెలుగవా?
నీతిని స్వీకరిస్తే
ఖ్యాతి కలుగజేయదా?

క్షమ పూలు రువ్వితే
శత్రువు మిత్రుడు కాడా?
చిరు నవ్వులు చిందిస్తే
స్నేహ ఫలమివ్వదా?

కన్నవారిని సేవిస్తే
దీవెనలు దొరకావా?
ఉన్న ఊరిని ప్రేమిస్తే!
జన్మ సార్ధకమవ్వదా?

వృద్ధులను గౌరవిస్తే
వృద్ధి భువిని కలుగదా?
సంస్కారం చాటితే
హుందాదనం ఉండదా?


కామెంట్‌లు