గొప్పతనం;-కొప్పరపు తాయారు

  గొప్పతనం ఎందులో ఉంది మంచి మనసులు మంచి మాటలు మంచి మన్ననలో .
           గురువుగాని, అమ్మ గాని, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు తెలుసా. ఎవరు చదువులో కానీ, బలహీనంగా ఉండటం వల్ల, వారి మీద ఎనలేని ప్రేమని గుప్పిస్తారు. ఎందుకంటే బాగా చదివ కలిగే శక్తి ఉండేవారు వాళ్ల పనులన్నీ వాళ్లే చేసుకుని చక్కగా ఎదుగుతారు.
                   కానీ బలహీనత మనిషిని మనస్సును క్రిందికి లాగి కూర్చోబెడుతుంది. ఆ నీరసం  మరి మనసుని లేవ నివ్వదు.అందుకు వారిరువురూ కూడా ఆ పిల్లల్ని ఉత్తేజ పరిచి,సంతోష పరిచి, సున్నితంగా తప్పులు దిద్ధుతూ,నేర్పుతూ తప్పించు కోకుండా, బాగు పడేట్టు చేయగల శక్తి మంతులు వారిరువురే !
                అందుకే వీరిద్దరూ పూజ నీయులు. వారికి
ఎనలేని గౌరవాభిమానాలు చూపించాలి.ఏమి చేసినా స్వార్థం లేకుండా చేయడమే వారి గొప్పతనం.
ఏమీ ఆశించకుండా పిల్లలు బాగు కోరి,బాగు పడేట్టు
చేయడమే వారి ముఖ్యోద్దేశం.అందుకే  వారికి ప్రథమ స్థానాలు,అమ్మ, గురువులకు.నమస్సులు...
కామెంట్‌లు