సుప్రభాత కవిత ; - బృంద
మెరిసేటి మెరుపులు
కురిసేటి మబ్బులు
ఉరిమేటి ఉరుములు
తడిసేటి తరువులూ

తాపాలు చల్లార్చు
సిరివాన చినుకులు
గ్రీష్మాన గగనంలో
గర్జించు మేఘాలు

అడ్డొచ్చిన మబ్బులను
తప్పించుకుంటూ
చొచ్చుకుని వచ్చేటి
వెలుగు కిరణాలు

వానెంత కురిసినా
వెలుగును ఆపునా??
చినుకెంత తడిపినా
దాహం తీరేనా??

ఋతువులు మారినా
గతులు మారునా?
మనసులో మర్మాలు
మాయకు దొరకునా?

ఎండైనా వెన్నెలైనా
అడుగు ఆగకూడదు
జీవన గమనంలో
వేగం తగ్గకూడదు

రాలుపూల చూసిచూసి
రాయిలాగా మారినా
చినుకు పడగానే మొలకెత్తు
గరికలాగా మారాలి

చెరగని విశ్వాసాన్నీ
తరగని ధైర్యాన్నీ
కానుకగా తెచ్చి
కన్నుల ముందు వెలిగే

ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు